
నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతి పుష్కరాల నేపథ్యంలో నేడు(సోమవారం) జరగాల్సిన ప్రజావాణిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని.. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
ఆధ్యాత్మిక ప్రవచనం
ప్రారంభం
కాళేశ్వరం: కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో పుష్కరాల సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, టీవీ జ్యోతిష్య శాస్త్ర ఆధ్యాత్మిక పండితులు పాలేపు చంద్రశేఖర శర్మ ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. ‘భాగవత భక్తి రసం’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, భక్తి మార్గం, ధర్మం, నైతిక విలువల ప్రాధాన్యతలపై శ్రద్ధాజనులకు లోతైన సందేశాలు అందించారు. దేవస్థాన ప్రాంగణంలో పెద్దసంఖ్యలో భక్తులు హాజరై ఈ ప్రవచనాన్ని ఆస్వాదించారు. అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
కాటారం: కాళేశ్వర ముక్తీశ్వరుడి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తీన్మార్ మల్లన్న ఆదివారం కుటుంబ సమేతంగా సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మహేశ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రంకు ఎనలేని చరిత్ర ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తుందన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మల్లన్న తెలిపారు. మల్లన్న వెంట తీన్మార్ మల్లన్న టీం జిల్లా అద్యక్షుడు రవిపటేల్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ హరిశంకర్, తదితరులు ఉన్నారు.
‘చెన్నయ్య ఆరోపణలు సరికాదు’
కాళేశ్వరం: మంత్రి శ్రీధర్‌బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నారని అవగాహన రాహిత్యంతో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపణలు చేయడం సరికాదని నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సెగ్గం రాజేష్ అన్నారు. ఆదివారం మహదేవపూర్ మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ మాట్లాడారు. సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కూడా అందించారని, ప్రొటోకాల్‌కు దేవాదాయ శాఖ కమిషనర్‌కు సంబంధం ఉండదని, అది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) చూసుకుంటుందని సూచించారు. మంథని నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ హయాంలో అనేక దళితుల హత్యలు జరిగినప్పుడు స్పందించని చెన్నయ్య మంత్రి శ్రీధర్‌బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నాడని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం మహదేవపూర్ మండల యూత్ అధ్యక్షుడు కొండగొర్ల సంతోష్, పూతల శ్యామ్ సుందర్, జాడి రాజసడవల్లి, దుర్గయ్య, నరేష్, రాజబాపు, జనార్దన్, బానేష్, నవీన్ పాల్గొన్నారు.
తునికాకు కూలీకి
పాముకాటు
వాజేడు: తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్లిన కార్మికురాలు పాముకాటుకు గురైంది. స్థానికులు, ఆమె భర్త లోహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన పూనెం శ్రీలత తునికాకు సేకరణ కోసం సమీపంలోని ములుకనపల్లి గ్రామం అవతల ఉన్న అడవిలోకి వెళ్లింది. తునికాకు సేకరిస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. వాజేడు వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి ఏటూరునాగారం అక్కడి నుంచి ములుగు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు లోహ మూర్తి తెలిపాడు.

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు