
పుష్పగిరి పీఠాధిపతికి పూర్ణకుంభ స్వాగతం
పుష్పగిరి పీఠాధిపతి అభివఉద్దండ విద్యాభారతిస్వామి ఆదివారం ముందుగా త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు చేశారు. నదికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం వద్దకు రాగా స్వామికి ఆలయ అర్చకులు, అధికారులు మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని అభిషేక పూజలు చేశారు. నేడు సోమవారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతి నదికి భక్తుల ప్రవాహం భారీగా పెరిగింది. ఆదివారం సెలవురోజు కావడంతో నాలుగవ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రదాన పూజలు చేశారు. పితృదేవతలకు తర్పనాలు నిర్వహించారు. నదీమాతకు చీరె, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తులతో పుష్కరిని నిండిపోయి దర్శమిచ్చింది. స్టాళ్లలో ఏర్పాటుచేసిన ఫుడ్‌కోర్డు, ఖాదీవస్త్రాలు, చిల్డ్రన్స్ ఆటలు, టెంట్‌సిటీలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పార్కింగ్ స్థలాల నుంచి భక్తులు ఆటోలలో కాళేశ్వరాలయానికి, బస్టాండ్ నుంచి కొంతమంది కాలినడకన, కొంతమంది ఆటోల్లో తరలివస్తున్నారు.

పుష్పగిరి పీఠాధిపతికి పూర్ణకుంభ స్వాగతం

పుష్పగిరి పీఠాధిపతికి పూర్ణకుంభ స్వాగతం

పుష్పగిరి పీఠాధిపతికి పూర్ణకుంభ స్వాగతం