
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గోల్డ్‌మెడల్ సాధించిన లావణ్యను డీడీ పోచం గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా సూర్య తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో కొమురం లావణ్య మాస్టర్ పర్యవేక్షణలో శిక్షణ పొందిందని తెలిపారు. మార్చిలో నిర్వహించిన ఇండియా, నేపాల్ అంతర్జాతీయ చాంపియన్ షిప్ పోటీల్లో 49 కిలోల కేటగిరిలో స్వారింగ్‌లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించినట్లు పేర్కొన్నారు.