
అన్నారం నుంచి వన్ వే ద్వారా మళ్లింపు..
బుధవారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో ట్రాఫిక్‌ను అన్నారం క్రాస్‌రోడ్డు నుంచి మళ్లించారు. హైదరాబాద్, వరంగల్, పరకాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలివచ్చాయి. అన్నారం క్రాస్‌రోడ్డు నుంచి అన్నారం వయా మద్దులపల్లి, పూస్కుపల్లి మీదుగా కాళేశ్వరం పార్కింగ్ స్థలాలకు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను మళ్లించారు. తిరిగి కాళేశ్వరం మహదేవపూర్, కాటారం మీదుగా వెళ్లేలా పోలీసు ఉన్నతాధికారులు ప్లాన్ చేశారు. అన్నారం నుంచి మద్దులపల్లి, పలుగుల బైపాస్‌రోడ్డులో ట్రాఫిక్ జాం కావడంతో రెండు గంటల పాటు భక్తులు ఇబ్బంది పడ్డారు. కొంతమంది వాహనాలు వదిలి కాలినడకన మూడు కిలోమీటర్ల దూరం తరలివచ్చారు.