
సర్టిఫికెట్ల ప్రదానం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అందించారు. సోలార్ 24మంది, డ్రోన్ 29మంది శిక్షణ తీసుకున్నారు. వృత్తి శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించి జీఎం మాట్లాడారు. నిరుద్యోగ యువతి, యువకులకు ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌కు బాటలువేసే విధంగా ఉంటుందన్నారు. స్వయంగా వారే ఉపాధి పొందే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, మారుతి, రామన్ పాల్గొన్నారు.