రేగొండ: భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రేగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భూసమస్యలు పరిష్కరించడానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 11 రెవెన్యూ గ్రామాల్లో 4,083 దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ శ్వేత తెలిపారు. ఇందులో ఎక్కువగా సాదాబైనామాల సమస్యలతోనే రైతులు దరఖాస్తులు చేస్తున్నారని తెలిపారు.
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏరియాలోని స్థానిక కొమురయ్య భవన్‌లో బుధవారం క ర్మిక సంఘాల జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింగరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మో టపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉ పాధ్యక్షుడు బేతేల్లి మధుకర్ రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్యలు పాల్గొని ఈనెల 20న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కా ర్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాత రాజు సతీష్, సీఐటీయూ బ్రాంచ్ కంపేటి రాజయ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కార్మికులు విధులకు హాజరుకావాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పని చేస్తున్న కార్మికులు ఏడాదికి కనీసం 100 నుంచి 191 రోజుల పాటు విధులకు హాజరుకావాలని 5వ గని మేనేజర్ జాకీర్ హుస్సేన్ సూచించారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో గని మేజర్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో గైర్హాజరు కార్మికులకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏడాదికి కనీసం 100 పని దినాలైన విధులకు హాజరు కావాలనే నిబంధన ఉండేదన్నారు. దానిని 191 రోజులకు పెంచారని, వంద మాస్టర్‌ల ప్రామాణికతను మానుకొని వి ధిగా హాజరయ్యే అలవాటు పెంపొందించుకోవా లని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఉ ద్యోగి ప్రతిరోజూ 8 గంటల పని సమయాన్ని పాటిస్తూ 100 శాతం ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 40 మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ సందీప్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు దోర్నాల తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు బుధవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చింతామణి జలపాతం వద్ద నీటిని తాగి ఆహ్లాదంగా గడిపారు. కొబ్బరికాయలను కొట్టి పూజలు చేశారు. శిఖాంజనేయస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం, షాపుల వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.

సాదాబైనామాలే అధికం