
రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్‌గా తీసుకోవాలి...
పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్‌గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి.
– డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు