
మనల్ని చుట్టుముట్టే సమస్యలే ఆవిష్కరణలకు దారితీస్తాయి. ఒకరకంగా అవి మనలోని టాలెంట్‌ని పదునుపెట్టేలా చేస్తాయి. మనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరికో మార్గం చూపే కాంతికిరణలవుతాయి. అందుకు నిదర్శనం ఈ మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రులే. వాళ్ల పిల్లలు ఎదుర్కొన్న సిండ్రోమ్ ఫలితంగా వచ్చిన ఫ్రీ ఏఐ హెల్త్‌కేర్ ఎందరికో మార్గం చూపి, వైద్యులే గుర్తించడంలో విఫలమైన వ్యాధులను ఐడెంటిఫై చేసి ఇవాళ ఎందరి ప్రాణాలనో కాపాడుతోంది.
మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ జూలియన్ ఇస్లా కొడుకు సెర్గీయో అరుదైన నాడీ సంబంధిత రుగ్మత డ్రావెట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. నిజానికి ఈ వ్యాధిని అంతతొందరగా ఏంటన్నది వైద్యుల కూడా త్వరగా గుర్తించలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ పరిస్థితితో బాధపడుతున్నారని తెలుసుకోవడానికి ఎన్నో నిరీక్షణల తర్వాత గానీ తెలుసుకోలేకపోతున్నారు.
ఇక్కడ జూలియన్ ఇస్లా కూడా తన పసికందు సమస్య ఏంటన్నది ఒక ఏడాది వరకు తెలుసుకోలేకపోతాడు. అప్పుడే ఆయన ఈ అరుదైన వ్యాధి నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే ఇస్లా వైద్య పురోగతి కోసం AIని ఉపయోగించేలా లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29ని స్థాపించారు.
సరిగ్గా ఆ సమయంలోనే అనుకోకుండా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ప్రసంగం వింటాడు. ఆయన తన స్పీచ్‌లో కొడుకు పోరాడుతున్న సెరిబ్రల్ పాల్సీ వ్యాధి తీరును హృదయవిదారకంగా వెల్లడిస్తాడు. దీంతో ఇస్లా వెంటనే నాదెళ్లను ఇమెయిల్ ద్వారా సంప్రదించి.. తన కొడుకు సెర్గియో కథను పంచుకుంటాడు. అలాగే ఇలా ఒక పట్టాన వ్యాధులు నిర్ధారణ కాని రోగులకు ఏఐ సాంకేతికత గేమ్-ఛేంజర్‌గా ఎలా ఉంటుందో వివరిస్తాడు ఇస్లా. ఆ వెనువెంటనే నాదెళ్ల ఐదు నిమిషాల్లోనే రిప్లై ఇచ్చి.. మైక్రోసాఫ్ట్ AI హెల్త్‌కేర్ బృందాలతో కనెక్ట్ అయ్యారు.
అంతేగాదు ప్రాథమిక AI అల్గారిథమ్‌లను ఉపయోగించి క్లినికల్-గ్రేడ్ డయాగ్నస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇస్లా స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29 అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. 2023 నాటికి, వారు అధునాతన భాషా నమూనాల ఆధారిత డయాగ్నస్టిక్ అసిస్టెంట్ అయిన DxGPT అభివృద్ధి చేశారు. ఇదెలా పనిచేస్తుందంటే..
DxGPT అంటే ..
ఇది వ్యాధిని నిమిషాల వ్యవధిలోనే నిర్థారిస్తుంది. ఇది ప్రజా వైద్య వనరులు, ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల కలయికతో ూకూడిన పజీపీటీ-40, 01 నమునాలను ఉపయోగిస్తుంది. ోగోప్యత దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సాంకేతికత. అలాగే ఏ రోగి డేటాను సేకరించదు, స్టోర్ చేయదు.
జస్ట్ రోగులు లేదా సంరక్షకులు ఇచ్చే లక్షణాలు, వివరణల ఇన్‌పుట్‌ని ఆధారంగా చేసుకుని రోగనిర్ధారణ సారాంశాన్ని పొందుతారు. దీని ఆధారంగా వైద్య పరీక్షలు చేయించుకుని ధృవీకరించుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉచితంగా యాక్సెస్ అయ్యే DxGPT అంతుచిక్కని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల బాధను తీర్చడంలో కీలకంగా ఉంటుంది.
(చదవండి: పిల్లిలా కనిపించాలనుకోవడం ఎంత పనైపాయే..! ఏకంగా రూ. 6 లక్షలు పైనే..)