
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: విద్యుత్ ప్రమాదాలు, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డీఈఈ నాగేశ్వర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థులకు, పలువురికి విద్యుత్ సేఫ్టీ అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు వచ్చినప్పుడు విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దన్నారు. తడి చేతులు, కాళ్లకు చెప్పులు లేకుండా కరెంటు వస్తువులను తాకొద్దని వివరించారు. విద్యుత్ వైర్లు తెగి రోడ్ల మీద పడినప్పుడు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ అశోక్, లైన్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్యతో పాటు లైన్‌మెన్‌లు రాజమౌళి, రవి, శ్రీనివాస్, జూనియర్ లైన్‌మెన్‌లు అమర్, సతీష్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.