ఈ–పాస్‌ యంత్రాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఈ–పాస్‌ యంత్రాల పంపిణీ

May 27 2025 1:03 AM | Updated on May 27 2025 1:03 AM

ఈ–పాస

ఈ–పాస్‌ యంత్రాల పంపిణీ

భూపాలపల్లి రూరల్‌: ఫర్టిలైజర్‌, ఎరువుల డీలర్లకు ఈ–పాస్‌ యంత్రాలను సోమవారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్‌ మాట్లాడుతూ ఈ పాస్‌ యంత్రంలో రైతు ఆధార్‌కార్డు నంబరు నయోదు చేసుకొని ఎరువు మందులను సరఫరా చేస్తారన్నారు. దీంతో ఎరువులు, విత్తనాల అక్రమ రవాణ, కల్తీలేని నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎంఏఓ సతీష్‌, వివిధ మండలాల ఏఓలు, ఈ పాస్‌ యంత్రాల కంపెనీ ప్రతినిధులు సుభాన్‌, తిరుమల్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

చిట్యాల: కాళేశ్వరం జోన్‌–1 పరిధి జిల్లాలోని చిట్యాల, కాటారం, భూపాలపల్లి(బాలికలు), ములుగు జిల్లాలోని జాకారం, ఏటూరు నాగారం (బాలురు), ములుగు (బాలికలు) పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కోఆర్డినేటర్‌, డీసీఓ టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ చిట్యాల ప్రిన్సిపాల్‌ గోల్కొండ భిక్షపతి సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28న తెలుగు, హిందీ, ఇంగ్లిషు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ నియామకానికి, 29న గణితం, సైన్స్‌, సోషల్‌, లైబ్రేరియన్‌ సబ్జెక్టులకు, 30న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల(బాలుర) జాకారంలో పాఠ్యాంశ బోధన డెమోలు ఉదయం తొమ్మిది గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తీసుకొని హాజరు కావాలని తెలిపారు.

వికసించిన మే పుష్పం

రేగొండ: ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం రేగొండ మండలకేంద్రంలోని వాణి విద్యానికేతన్‌ పాఠశాలలోని గార్డెన్‌లో సోమవారం పూసింది. ఏడాదిలో ఒకసారే వికసించే ఈ పుష్పం అందరినీ ఆకట్టుకుంది. మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతిని ఆస్వాదించే వారు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ మొక్కను పుట్‌బాల్‌ లిల్లీ లేదా బ్లడ్‌ లిల్లీగా పిలుస్తుంటారు. ఇది మూడు రోజులు వికసించి ఉంటుంది.

క్రీడలు ఐకమత్యాన్ని చాటుతాయి

భూపాలపల్లి రూరల్‌: క్రీడలు ఐకమత్యాన్ని చాటుతాయని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో సోమవారం ఏర్పాటుచేసిన 8, 10, 12 సంవత్సరాల బాల, బాలికలకు సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలను సీఐ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. బాల బాలికలు ప్రతిఒక్కరు ఏదైనా ఒక క్రీడలో ప్రావీణ్యం పొందాలన్నారు. క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో ఆడి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ఎంపికై న బాల, బాలికలు జూన్‌ 1వ తేదీన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని అథ్లెటిక్‌ చైర్మన్‌ పంతకాని సమ్మయ్య తెలిపారు. ఈ ఎంపిక క్రీడల్లో అథ్లెటిక్‌ కమిటీ ఉపాధ్యక్షుడు అజయ్‌, కోచ్‌ రఘువీర్‌, కోచ్‌లు పాల్గొన్నారు.

టీచర్ల శిక్షణ శిబిరం మార్పు

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో మంగళవారం(నేడు) నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణకు సంబంధించి శిబిరాన్ని హసనపర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వద్ద గ్రీన్‌వుడ్‌ పాఠశాలకు మార్చి నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు, అలాగే ఉమ్మడి జిల్లాలోని భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు తొలుత పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో శిక్షణ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనివార్య కారణాలతో శిక్షణ వేదిక మార్చినట్లు పేర్కొన్న డీఈఓ.. ఈ విషయాన్ని సంబంధిత ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.

ఈ–పాస్‌ యంత్రాల పంపిణీ
1
1/1

ఈ–పాస్‌ యంత్రాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement