
– వివరాలు, మరిన్ని ఫొటోలు 8,9లోu
పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు పునీతులయ్యారు. కాళేశ్వరం సందర్శనలో జ్ఞాపకాల్ని మూటగట్టుకెళ్లారు. ఎండ, వాన.. గాలి దుమారం.. ఇవేవీ వారిని అడ్డుకోలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్.. నదీ పరిసరాల్లో బురద.. వారి సంతోషానికి అడ్డు కాలేదు. కిక్కిరిసిన భక్తులతో ఆర్టీసీ బస్సులు. దారి పొడవునా ప్రైవేట్ వాహనాలు. ఇలా.. లక్షలాది మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చారు. నదీ మాతకు పూజలు చేశారు. తర్పణాలు వదిలారు. పిండ ప్రదానాలు చేశారు. నదిలో దీపాలు వదిలారు. చీరెసారె సమర్పించారు. 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. నదీమాతకు నవరత్న మాల హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సోమవారంతో సరస్వతీ నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు లక్ష మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు.

– వివరాలు, మరిన్ని ఫొటోలు 8,9లోu