
రిజర్వేషన్ అమలు తర్వాతే ఎన్నికలు
కాళేశ్వరం: అసెంబ్లీలో తీర్మానం చేసిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని, అ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహదేవపూర్ మండలకేంద్రంలోని మార్కెట్ యార్డు వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వాటాను అందించాలని డిమాండ్ చేశారు. శాసీ్త్రయ పద్ధతిలో దేశవ్యాప్తంగా కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీపతిబాబు, కాళేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ పోత వెంకటస్వామి, జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్‌చార్జ్ విజయగిరి సమ్మయ్య, జేఏసీ మండల అధ్యక్షుడు సముద్రాల తిరుపతి, నాయకులు ప్రకాశ్, బాబురావు, ధర్మయ్య పాల్గొన్నారు.