
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
IIలో
రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
– సాక్షిప్రతినిధి, వరంగల్
● ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్‌రెడ్డి పర్యటన
● దేవాదుల పంపుహౌజ్, రిజర్వాయర్‌లపై రివ్యూ...
● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్
● హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ
● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష