
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ: భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తున్న రెవె న్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సమస్యలకు పరిష్కారం లభించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న పట్టా పాస్ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, కాంగ్రెస్ నాయకులు గంగుల రమణారెడ్డి, గంట గోపాల్, వెంకటస్వామి, పన్నాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.