15 వరకు టెన్త్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు | - | Sakshi
Sakshi News home page

15 వరకు టెన్త్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు

May 3 2025 7:52 AM | Updated on May 3 2025 7:52 AM

15 వరకు టెన్త్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు

15 వరకు టెన్త్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు

భూపాలపల్లి అర్బన్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు, రీ వెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు సబ్జెక్ట్‌ల వారీగా ఎటువంటి అపరాద రుసుం లేకుండా అన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని సూచించారు.

మొదటి నెలలో

70 శాతం బొగ్గు ఉత్పత్తి

భూపాలపల్లి అర్బన్‌: 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌ మాసంలో బొగ్గు ఉత్పత్తి 70శాతమే సాధించారు. ఈ మేరకు శుక్రవారం ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి ఏరియాలో ఉత్పత్తి వివరాలను శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గడిచిన మాసంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 3.85లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా.. 2.70లక్షల ట న్నుల బొగ్గును వెలికి తీసినట్లు తెలిపారు. 3.85లక్షల టన్నుల బొగ్గు రవాణాకు 3.25లక్ష ల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. ఓసీ 2, 3 ప్రాజెక్ట్‌లో 1.35లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీయాల్సి ఉండగా 1.10లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని వెలికితీసినట్లు తెలిపారు. ఏరియాలో ఉత్పత్తిని పెంచడానికి ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎస్‌డీఎల్‌ పని గంటలను పెంచడానికి, రక్షణ నియమాలు పాటిస్తూ పని చేయాలని సూచించారు.

పునరుద్ధరణ పనుల పరిశీలన

రేగొండ: మండలంలోని తిరుమలగిరి, రామన్నగూడెం, కొత్తపల్లి బి, కొత్తపల్లిగోరి మండలంలోని కొనరావుపేట, జగయ్యపేట గ్రామాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో వీచిన వర్షానికి చెట్లు విరిగి తీగల మీద పడడంతో స్థంభాలు విరిగి, ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. కాగా శుక్రవారం విద్యుత్‌ పునరుద్ధరణ పనులను సీఎండీ కర్నాటీ వరుణ్‌రెడ్డి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. విరిగిపడిపోయిన స్థంబాల పునరద్ధరణ పనులు పూర్తి చేసి విద్యుత్‌ సరఫరా అందించాలన్నారు. కా ర్యక్రమంలో సీజీఎం రాజుచౌహన్‌, జీఎం సు రేందర్‌, ఎస్‌ఈ మల్సూర్‌ నాయక్‌, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈలు రాజు, వెంకటరమణ, సురేష్‌, విశ్వాసరెడ్డి పాల్గొన్నారు.

వాలీబాల్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కేంద్రంలో వాలీబాల్‌ వేసవి శిక్షణ శిబిరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రఘు శుక్రవారం ప్రారంభించారు. 14 సంవత్సరాల లోపు ఆసక్తిగల పిల్లలు ఈ శిబిరంలో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటలపాటు జూన్‌ 6వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్కారి ప్రభాకర్‌, కోచ్‌ మోటం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

63 మంది పోలీసు సిబ్బంది బదిలీ

భూపాలపల్లి: సాధారణ బదిలీల్లో భాగంగా 63 మంది పోలీసు సిబ్బందిని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ఎస్పీ కిరణ్‌ ఖరే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లపాటు పని చేసిన సిబ్బందికి స్థానచలనం కల్పించారు. పోలీస్‌స్టేషన్లలో ఖాళీల ను సిబ్బందికి తెలుపుతూ, సీనియారిటీ ప్రకా రం ఆయా ఠాణాలకు కేటాయించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన బదిలీ ల్లో మొత్తం 63 మంది ట్రాన్స్‌ఫర్‌ కాగా 52 మంది కానిస్టేబుళ్లు, ఏడుగురు మహిళా కానిస్టేబుళ్లు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు ఏఎస్సైలు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్‌, ఏఓ వసీం ఫర్హాన, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement