
క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
చిట్యాల: క్రీడాకారులకు క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో జీఎస్‌ఆర్ సీసీపీఎల్ క్రికెట్ క్రీడోత్సవాల్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. ఓటమి చెందిన క్రీడాకారులు రేపటి గెలుపు కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, జిల్లా, మండల నాయకులు అప్పం కిషన్, ముకిరాల మధువంశీకృష్ణ, కామిడి రత్నాకర్‌రెడ్డి, దబ్బెట అనిల్, చిలుకల రాయకొంరు, పుల్లూరి సతీష్, కట్కూరి నరేందర్, సర్వ శరత్, తదితరులు పాల్గొన్నారు.