
సీఎం దృష్టికి కార్మికుల సమస్యలు
భూపాపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎండీ బలరాం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మంత్రులు సైతం సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని, కార్మికులకు సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఆదాయ పన్ను మాఫీ, కార్పొరేట్ మెడికల్ బోర్డు మార్పు, మెడికల్ అటెండెన్స్ నిబంధనలలో మార్పులు, డిస్మిస్ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోవాలని, హైదరాబాద్‌లో సూపర్ స్పెషలాటీ ఆస్పత్రి ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్రం, రాష్ట్ర నాయకులు శేష రత్నం, జోగు బుచ్చయ్య, మధుకర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, రాజేష్, ఆశోక్, రమేష్, రవికిరణ్, అలీం, అశోక్, రాంబాబు పాల్గొన్నారు.