
ఎండలో ఇబ్బంది పడ్డాం..
శనివారం తెల్లవారు జామున యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి భార్యభర్తలిద్దరం కాళేశ్వరం పుష్కర స్నానానికి బయలుదేరాం. ఉదయం 10.30గంటల నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం. బస్సులో ఎండ వేడి బరించలేకుండా ఉంది. తాగునీరు, భోజనం లేక ఇబ్బంది పడ్డాం. – లత, ఆలేరు, యాదాద్రి భువనగిరి
ట్రాఫిక్‌ను నియంత్రించాలి..
పోలీస్, అధికార యంత్రాంగం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రహదారి వెంట పోలీసులను ఏర్పాటు చేయాలి. రోడ్డుపై వాహనాలు ఒకే వరుసగా వెళ్లే విధంగా చూడాలి.
– సతీష్, డ్రైవర్, కరీంనగర్

ఎండలో ఇబ్బంది పడ్డాం..