
ఏర్పాట్ల పరిశీలన
ములుగు: జిల్లాకేంద్రంలో నూతన బస్‌స్టేషన్ పనులను ప్రారంభించడానికి నేడు మంత్రి సీతక్కతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ముందుగా ఉదయం 9గంటలకు గట్టమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌కు బైక్ ర్యాలీగా వస్తారు. బస్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం లీలా గార్డెన్‌లో నిర్వహించే సభకు మంత్రులు హాజరవుతారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ రవీందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసుశాఖ తరఫున భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు.