తాగునీరు లేక కష్టాలు..
గంటల తరబడి వాహనాలు ఇరుక్కుపోయి ఎండ వేడిలో ఇబ్బంది పడ్డాం. అధికారులు మార్గమధ్యలో తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. వెంట తీసుకువచ్చిన తాగునీరు అయిపోయాయి. సకాలంలో దర్శనం చేసుకొని భోజనం చేయాల్సి ఉండగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆకలితో అలమటించాం. – సురేందర్‌రెడ్డి, సిరిసిల్ల
5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం..
ఉదయం 11.30గంటలకు ఆర్టీసీ బస్సులో వచ్చి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాం. ట్రాఫిక్ జామ్ నుంచి బస్సు కాళేశ్వరానికి రావడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుందనడంతో ఐదు కిలోమీటర్ల దూరం నుంచి నడుకుంటూ వచ్చాం. అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి. – చందు, భద్రాచలం
తాగునీరు లేక కష్టాలు..


