
ఆశయానికి ‘అమ్మ’ అండ..
జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శుత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సింధూర్–2 యుద్ధంలో సేవలు అందిస్తున్నాడు. ఆడపిల్లల నొదుటి బొట్టు తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించే విధుల్లో తన కొడుకు భాగస్వామిగా ఉండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తల్లి అన్నపూర్ణ గర్వంగా చెబుతున్నారు.