
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
మొగుళ్లపల్లి: మండలంలోని ఇస్సిపేట, మొగుళ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు నిబంధనలు పాటించాలని.. తేమశాతం 17 దాటకూడదని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఫార్మర్ రిజిస్ట్రీ గురించి రైతులకు వివరించి ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేందర్‌రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.