
భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున దర్శనానికి వస్తున్న సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్‌ఖరే సిబ్బందికి సూచించారు. దేవాలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి శుక్రవారం ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ఓపికగా విధులు నిర్వహించాలని, తొక్కిసలాట జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్పీ కిరణ్ ఖరే