తమిళనాడులోని మహాబలిపురం నుంచి లారీలో సరస్వతి అమ్మవారి విగ్రహం, నాలుగు వేదమూర్తుల విగ్రహాలు ఆదివారం సాయంత్రం కాళేశ్వరానికి వచ్చాయి. కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం త్రివేణి సంగమ తీరంపైన దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.కోటితో బేస్‌మెంట్‌స్టాండ్ నిర్మాణం, విగ్రహ తయారీ పనులు చేపట్టారు. సోమవారం విగ్రహాన్ని కాంక్రీటు బేస్‌మెంట్ స్టాండ్‌పై ఇన్‌స్టాల్ చేయనున్నారు. అమ్మవారి విగ్రహం చుట్టూర వేదమూర్తులను ఆసీనులు చేస్తారు. తరువాత లాన్, ఇతర సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. – కాళేశ్వరం