రేపటినుంచి జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

రేపటినుంచి జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

May 28 2025 11:51 AM | Updated on May 28 2025 11:51 AM

రేపటినుంచి జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

రేపటినుంచి జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

భూపాలపల్లి అర్బన్‌: ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు రాజస్థాన్‌ రాష్ట్రంలో ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ తెలిపారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి తనతో పాటు యూనియన్‌ అధ్యక్షుడు సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లపై చర్చించనున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు కోడ్‌లను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రమేష్‌, సుధాకర్‌రెడ్డి, రాంచందర్‌, రాజారత్నం, రాజమహ్మద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement