
ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఆశ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఆశ డేను పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని కొడిశాల పీహెచ్‌సీని సందర్శించి ఆశ కార్యకర్తలతో మాట్లాడారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ లాంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరించి నాలుగో విడత స్క్రీనింగ్ పరీక్షలకు ప్రజలు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని తెలిపారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, ప్రతీ ఆశ కార్యకర్త విధిగా తెమడ పరీక్షలు చేయించాలన్నారు.