
నిలిచిన దేవాదుల పంపింగ్
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం సమీపంలోని దేవాదుల మోటార్ల పంపింగ్‌ను నిలిపివేశారు. గత కొద్ది రోజుల నుంచి ఒక మోటార్ ద్వారా పంపింగ్‌ను కొనసాగించిన అధికారులు గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో బుధవారం పంపింగ్‌ను పూర్తిగా నిలిపి వేశారు. పంపింగ్ వద్ద 10మోటార్లు ఉండగా గతంలో కొన్ని మోటార్లతో పంపింగ్‌ను కొనసాగించి వారం క్రితం బంద్‌చేసి ఒక మోటార్‌ను మాత్రమే పంపింగ్‌లో ఉంచారు. మంగళవారం వరకు ఒక మోటారు ద్వారా 247 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపింగ్ చేసిన అధికారులు బుధవారం ఒక మోటారు పంపింగ్‌ను కూడా పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంపింగ్ వద్ద 71.65 మీటర్ల నీటి మట్టం ఉంది.
సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద..
తుపాకులగూడెం గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. కొన్ని రోజులుగా ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గాయి. దీంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.727టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పూర్తిలెవల్ 83మీటర్లు కాగా 72.10 మీటర్లకు చేరుకుంది. బ్యారేజీలో 59గేట్లు ఉండగా అందులో 58 గేట్లను మూసి ఒక గేటు ఓపెన్ చేసి దిగువకు 200క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గోదావరిలో తగ్గిన నీటిమట్టం
సమ్మక్క బ్యారేజీ వద్ద డెడ్ స్టోరేజీ