గోదావరికి పౌర్ణమి హారతి
కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గోదావరికి హారతి కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం నుంచి కాలినడకన మంగళవాయిద్యాలతో తరలి వెళ్లారు. గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ప్రత్యేక పూజలతో హారతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు భైకుంఠపాండా, రామాచారి, సుబ్రహ్మణ్యశర్మ, రామకృష్ణ, రాముశర్మ, శరత్‌చంద్ర, శ్రావణ్ పాల్గొన్నారు.
గోదావరికి హారతి ఇస్తున్న అర్చకులు


