
స్టాళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు
కాళేశ్వరం: సరస్వతినది పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అందుబాటులో ఉండే సదుపాయాలను, సేవలను సమీక్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు, భక్తులకు సరఫరా చేసే తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్వచ్ఛత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కన్ సింగ్ రాజ్‌ఠాకూర్, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ, డీఆర్‌డీఓ నరేష్ పాల్గొన్నారు.
భట్టి విక్రమార్కకు ఘనస్వాగతం
భూపాలపల్లి రూరల్: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వెళ్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘనస్వాగతం పలికారు. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, రాజేందర్, టీపీసీసీ సభ్యుడు సల్లూరి మధు, అంబాల శ్రీనివాస్, అప్పం కిషన్, ఉడుత మహేందర్ ఉన్నారు
సర్వీస్ బస్సులతో ఊరట
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలోని తాత్కాలిక బస్టాండ్ ఆవరణ నుంచి సరస్వతి పుష్కరఘాట్ వరకు ఏర్పాటుచేసిన ఉచిత షటిల్ బస్సు సర్వీస్‌లతో భక్తులకు ఊరట కలిగింది. ప్రత్యేక తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరభారం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తుగా సింగరేణి సహకారంతో స్కూల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
రెండో రోజు అన్నదానం
భూపాలపల్లి రూరల్: సరస్వతి పుష్కరాలకు వస్తున్న భక్తుల కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసిన ఉచిత అన్నదానం కార్యక్రమం రెండవరోజు భూపాలపల్లి సీఐ నరేష్‌గౌడ్‌తో కలిసి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్సై రమేష్ పాల్గొన్నారు.
స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలని డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిలువేరు అశోక్, ఐత తిరుపతి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించిందన్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఏడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అతి తక్కువ వేతనంతో పాఠశాలలను శుభ్రం చేసినా ప్రతి నెలా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.

స్టాళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు

స్టాళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు