
వినాయక చవితికి విధుల్లోకి కొత్త అర్చకులు!
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో కొత్తగా నియమితులైన ఐదుగురు అర్చకుల్లో నలుగురు వినాయక చవితి పండుగకు విధుల్లోకి చేరనున్నట్లు తెలిసింది. ఐదుగురు అర్చకుల్లో ఒకరు పలు అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఆయన ఫైల్‌ను పరిశీలనకు పంపినట్లు తెలిసింది. మిగితా నలుగురు అర్చకులు ఆర్డర్ కాపీలతో వినాయక చవితి రోజున విధుల్లోకి చేరుతారని సమాచారం. దీంతో అర్చకుల కొరత కొంత తీరనుంది.
108 వాహనాల తనిఖీ
రేగొండ/మొగుళ్లపల్లి: రేగొండ, మొగుళ్లపల్లి మండల కేంద్రాల్లోని 108 వాహనాలను 108 జిల్లా మేనేజర్ నరేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని మెడిసిన్‌తో పాటు మెడికల్ ఎక్విమెంట్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనంలో కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకుంటూ కాల్ వచ్చిన వెంటనే స్పందించి వాహనం బయలుదేరాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమర్ఙెన్సీ మెడికల్ టెక్నిషీయన్లు శంకర్‌రావు, రాజు, పైలట్లు శ్రీనివాసరావు, సత్యం పాల్గొన్నారు.
భూములు లాక్కుంటే ఊరుకోం..
కాటారం: పట్టాల పేరిట కొందరు ఆదివాసీ, గిరిజన, బలహీన వర్గాల భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర పూల్‌సింగ్ నాయక్ అన్నారు. మహాముత్తారం మండలకేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాముత్తారం మండలం నిమ్మగూడెంలోని గిరిజన, బలహీన వర్గాలకు చెందిన 900 ఎకరాల భూమిని బ్రాహ్మణ, వెలమ దొరలు, మైదాన ప్రాంత గిరిజనేతరులు పట్టాల పేరుతో స్వాధీనపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
నిధుల దుర్వినియోగంపై విచారించాలి
భూపాలపల్లి రూరల్: మహదేవపూర్ మండలకేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై ఆర్డీఓ స్థాయి అధికారితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ ఇన్‌చార్జ్ కొరిపెల్లి ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ డ్యాగల శ్రీనివాస్, జిల్లా చైర్మన్ భూక్య సురేష్‌నాయక్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు మాట్లాడారు.
విజయవంతం చేయాలి
గణపురం: జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి అన్నారు. జిల్లాస్థాయి పోటీలను గణపురం మోడల్ స్కూల్‌లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం మొక్కలు నాటాలన్నారు. విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని చెప్పారు. ఈనెల 27 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని, 30న ఫలితాలు విడుదల చేస్తారని చెప్పారు. ఈకో మిత్ర ఆన్‌లైన్ యాప్ ద్వార రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి పాల్గొన్నారు.
బొగతలో పర్యాటకులు
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి శనివారం పర్యాటకులు తరలివచ్చారు. బొగత నుంచి జాలువారుతున్న జలధారలను తిలకిస్తూ సెల్ఫీలు దిగి సందడి చేశారు. కొలనులో స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు.

వినాయక చవితికి విధుల్లోకి కొత్త అర్చకులు!

వినాయక చవితికి విధుల్లోకి కొత్త అర్చకులు!