
వచ్చే నెల 13న లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేశ్‌బాబు తెలిపారు. శనివారం కోర్టు ఆవరణలో జిల్లాలోని పోలీసు అధికారులతో జడ్జి సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాద, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్, చెక్ బౌన్స్, రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న తమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు. కోర్టులలో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు కృషిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, కాటారం డీఎస్పీ సూర్వనారాయణ, సీఐలు, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
న్యాయవాదులను అభినందించిన ప్రధాన న్యాయమూర్తి
హనుమకొండలో నిర్వహించిన మధ్యవర్తిత్వ శిక్షణలో జిల్లాలోని బార్ అసోసియేషన్ తరఫున పాల్గొన్న న్యాయవాదులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు అభినందించారు. శిక్షణ ముగించుకొని వచ్చిన న్యాయవాదులు శనివారం మర్యాదపూర్వకంగా ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ.. కేసుల్లోని ఇరువర్గాలను సమన్వయ పరిచి కేసుల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్, శిక్షణ పొందిన న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు