
ఏటీసీ కోర్సులతో యువతకు భవిష్యత్
● కార్మికశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రాజేంద్రప్రసాద్
కాటారం: ఐటీఐ అనుసంధానంగా ఏర్పాటుచేసిన ఏటీసీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న కోర్సులతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిగి వారి ఉజ్వల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతాయని కార్మికశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని రైతువేదికలో శనివారం మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులతో సమావేశం నిర్వహించి ఏటీసీ కోర్సులపై అవగాహన కల్పించారు. ఏటీసీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న కోర్సులు అభ్యసించడం ద్వారా కలిగే ఉపాధి అవకాశాలను కార్మిక శాఖ అధికారులు, ఐటీఐ ప్రిన్సిపాల్స్ వివరించారు. తక్కువ కాలవ్యవధిలో ఏటీసీ కోర్సులు పూర్తి చేయవచ్చని.. తద్వారా మంచి జీతంతో ఉపాధి అవకాశాలు లేదా స్వయం ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. ఏటీసీ కోర్సులతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా లేబర్ ఆఫీసర్ వినోద, భూపాలపల్లి, కాటారం ఐటీఐ ప్రిన్సిపాల్స్ జుమ్లానాయక్, తిరుపతి, ఏపీఎం రవీందర్, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.