విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

Aug 24 2025 8:20 AM | Updated on Aug 24 2025 8:20 AM

విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

భూపాలపల్లి అర్బన్‌: సిబ్బంది సమన్వయం, విబేధాల కారణంగా విద్యార్థులను ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ హెచ్చరించారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి సంక్షేమ వసతి గృహాలలో ఆహారం, తాగునీటి నాణ్యత, సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై క్లస్టర్‌ అధికారులు, హాస్టల్‌ పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కేజీబీవీ సంక్షేమ అధికారులు, జిల్లా కో ఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి నాణ్యమైన భోజనం, విద్య అందిస్తుంటే కొంతమంది ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయ లోపం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక ముందు హెచ్చరికలు ఉండవని, సస్పెండ్‌ చేయడమే ఉంటుందని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వసతి గృహాల్లో ఆహారం, సౌకర్యాలు కల్పన పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని, సోమవారం నుంచి క్లస్టర్‌, పోలీస్‌ అధికారులు ప్రతీ హాస్టల్‌ తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే సస్పెండ్‌ చేసేందుకు వెనుకాడబోమని విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లితండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉంటూ విద్యార్థులు చదువుకుంటున్నారని.. వారిని మంచిగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఏదేని సమస్య ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడి సమన్వయ లోపాలను గుర్తించాలని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు స్నేహపూరిత వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో మధ్యాహ్న భోజనం పరిశీలించాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు పడే అర్బన్‌ రెసిడెన్షియల్‌, కేజీబీవీ, కొర్కిశాల ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, డీఈఓ రాజేందర్‌, ఇంటర్మీడియట్‌ అధికారి వెంకన్న పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement