
క్రీడలతో శారీరక దృఢత్వం
భూపాలపల్లి అర్బన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానం వరకు జాతీయ క్రీడా దినోత్సవ రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే జెండా ఊపి, క్రీడా జ్యోతితో రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, వివిధ శాఖల అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలికి క్రీడల ప్రాధాన్యతను ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, అధికారులు, క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు