
ప్రశాంతంగా పాలీసెట్ ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన పాలీసెట్ అర్హత ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు పాలీసెట్ జిల్లా కన్వీనర్, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన మూడు పరీక్ష కేంద్రాల్లో 864మంది విద్యార్థులకు 824మంది హాజరుకాగా 40మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంట వరకు పరీక్ష నిర్వహించారు. క్షుణంగా పరిశీలించిన తరువాత విద్యార్థులను 10గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.