
ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలి
కాటారం: రైతులు ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటా రం మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గారెపల్లి, ధన్వాడ, శంకరాంపల్లి, రేగులగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం డీసీఓ పరిశీలించారు. ధాన్యం నిల్వలు, కొనుగోళ్లు సాగుతున్న ప్రక్రియ, రవాణా తదితర అంశాలపై ఆరాతీశారు. ధాన్యం నాణ్యత, తేమశాతం పరిశీలించారు. కొనుగోళ్లు త్వరితగతిన పూర్తిచేయాలని పీఏసీఎస్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని వెను వెంటనే తరలించాలని సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీసీఓ వెంట మానిటరింగ్ ఆఫీసర్ రిలీఫ్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ ఎడ్ల సతీశ్, సిబ్బంది ఉన్నారు.