
భక్తులకు ట్రాఫిక్ కష్టాలు..
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల నేపథ్యంలో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం నుంచే వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఉదయం 9గంటల నుంచి భక్తులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కార్లు, ఆటోలు, బస్సులలో భక్తులు కాళేశ్వరం వస్తున్నారు. కాళేశ్వరం నుంచి మహదేవపూర్ మండలం కూదురువెళ్లి వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్ అంతరాయం కలగడం వలన ఎండ వేడిమికి అల్లాడిపోయారు. ఉక్కపోత భరించలేక వాహనాలు దిగి అడివిలో చెట్ల కింద కూర్చొని కొందరు సేదదీరగా.. మరికొందరు చేసేదేమీ లేక భక్తులు కాలినడకన రోడ్డువెంట బారులుదీరారు. మార్గమధ్యలో అధికారులు భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. గంటల తరబడి రోడ్డుపై పడిగాపులు కాచిన మహిళలు, చిన్నారులు నిరసించిపోయారు.
11 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
అడవిలో తాగునీరులేక ఇబ్బందులు
కాలినడకన సరస్వతి ఘాట్‌కు..

భక్తులకు ట్రాఫిక్ కష్టాలు..

భక్తులకు ట్రాఫిక్ కష్టాలు..