
విజయం దక్కాలని ప్రత్యేక పూజలు
కాళేశ్వరం/రేగొండ: పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విజయం లభించాలని, ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి, త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ కాళేశ్వరాలయం, రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరాలయం దేవస్థాన ఈఓ ఎస్.మహేష్, స్థపతి వల్లినాయగం, ఎస్‌ఈ దుర్గాప్రసాద్, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, కోటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ ధర్మకర్తలు బండి మల్లయ్య, మల్లెబోయిన శ్రీధర్, మూల ఓంకార్ పాల్గొన్నారు.

విజయం దక్కాలని ప్రత్యేక పూజలు