వెంకటరమణకు గోల్డ్‌మెడల్
చిట్యాల: యాంటీ పైరసీ నివారణలో మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన అప్పాల వెంకటరమణ ముంబయిలో జరిగిన కార్యక్రమంలో శనివారం సినీనటుడు అమీర్‌ఖాన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. సోషల్‌మీడియాలో యాంటీపైరసీ నివారణ, సినిమా రంగం, టెలివిజన్‌లపై ముంబయిలో నాలుగు రోజులుగా ప్రపంచ స్ధాయి వేవ్స్ సమ్మిట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు న్యూరోనిక్స్ ల్యాబ్ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపీనికి చెందిన వెంకటరమణ, కమిటీ సభ్యుడు సినీ దర్శకుడు తేజ హాజరయ్యారు. 32 కేటగిరిలో యాంటీ పైరసీ కేటగిరిలో సాఫ్ట్‌వేర్ ఎలా నివారించాలనే విభాగంలో అప్పాల వెంకటరమణ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను సబ్మిట్ చేయగా ఆయన గోల్డ్‌మెడల్‌కు ఎంపికై అవార్డు అందుకున్నారు.


