
రైతులకు భూధార్ కార్డులు
రేగొండ(కొత్తపల్లిగోరి): ఆధార్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన యూనిక్ కోడ్ (భూధార్ కార్డు)ను కేటాయిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్ తెలిపారు. బుధవారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక రైతువేదికలో ఫార్మర్ రిజిస్ట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతోందన్నారు. రైతు యూనిక్ కోడ్ పొందాలంటే ఆధార్‌కార్డుతో పాటు లింక్ చేసిన సెల్‌ఫోన్ నంబరు, పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులు తమ వివరాలు నమోదు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ నిధులు వస్తాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్, రైతులుపాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్