భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి

May 7 2025 12:42 AM | Updated on May 7 2025 12:42 AM

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

రేగొండ: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని మడ్తపల్లి, పొనగండ్ల గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సమస్యలకు పరిష్కారం లభించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, డిప్యూటీ తహసీల్దార్‌ రజాక్‌, కాంగ్రెస్‌ నాయకులు నాయినేని సంపత్‌రావు, భిక్షపతి, వినోద్‌, నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement