భూభారతితో సమస్యలు పరిష్కారం
రేగొండ: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని కొడవటంచ, లింగాల గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన చట్టం ద్వారా రైతులకు భూమి హక్కు రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించిందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే ముందు భూముల పూర్తి వివరాలతో సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తారన్నారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో భూములకు భూధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న పట్టా పాస్ పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ రజాక్, కాంగ్రెస్ నాయకులు నాయినేని సంపత్‌రావు, భిక్షపతి, బోయిని వినోద్, కోసరి నరేందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


