రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం.. | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..

May 1 2025 1:13 AM | Updated on May 1 2025 1:13 AM

రాష్ట

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..

భూపాలపల్లి అర్బన్‌: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 22వ స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత ఒక శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయి స్థానంలో తగ్గింది. గతేడాది 15వ స్థానంలో నిలవగా.. ఈసారి తగ్గడం గమన్హారం. బాలురతో పోలిస్తే బాలికలు ఒక శాతం పైచేయి సాధించారు. జిల్లాలో 66 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 10మంది ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యార్థులు 550కిపైగా మార్కులు సాధించారు. ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

3,221 మంది విద్యార్థుల పాస్‌

జిల్లాలో 121 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటినుంచి 3,443మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,221 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 1,725 మందికి 1,606మంది (93.10శాతం) ఉత్తీర్ణులు కాగా.. బాలికల విభాగంలో 1,718మందికి 1,615మంది (94శాతం) ఉత్తీర్ణులయ్యారు. 222మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఫెయిలయ్యారు.

పరీక్ష రాసిన విద్యార్థులు

3,443

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

3,221

సాధించిన శాతం

93.52

ఫెయిల్‌ అయిన విద్యార్థులు

222

వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు

66

సంవత్సరం సాఽధించిన స్థానం

2016–17 14

2017–18 5

2018–19 7

2021–22 8

2022–23 5

2023–24 16

2024–25 22 (ప్రస్తుతం)

కరోనా కారణంగా 2019–20, 2020–21

సంవత్సరాల్లో పరీక్షలు

నిర్వహించలేదు.

ఉత్తీర్ణత శాతం పెరిగినా తగ్గిన స్థానం

పలువురు విద్యార్థులకు

రాష్ట్రస్థాయి మార్కులు

66 పాఠశాలల్లో

వంద శాతం ఉత్తీర్ణత

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..1
1/4

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..2
2/4

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..3
3/4

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..4
4/4

రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement