
సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ..
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
– 10లోu
కాళేశ్వరంతో పాటు చుట్టుప్రక్కల శివారుల్లో సుమారు 200కుపైగా సీసీ కెమెరాలు పోలీసులు అమర్చుతున్నారు. కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన కెమెరాలు 60, ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినవి 11, ప్రధాన రహదారిలో 30కిపైగా ఉన్నాయి. మొత్తం 25 లొకేషన్‌లలో సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లొకేషన్‌లో మూడు నుంచి నాలుగు వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాలు 4 మెగా ఫిక్సల్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తు తం పుష్కరాల నేపథ్యంలో మజీదుపల్లి రోడ్డు, వీఐపీఘాటు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలాలు, ప్ర ధానఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు ఉన్న గ్రావెల్ రోడ్డు, అక్కడే ఉన్న హెలిపాడ్ వద్ద, ప్రధానఘాటు, శ్రాద్ద మండపాలు, గోదావరి నుంచి బస్టాండ్ వరకు, ఆలయం చుట్ట పరిసరాలు, మహా రాష్ట్ర రోడ్డు అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం బస్టాండ్ వరకు, అక్కడే ఉన్న పార్కింగ్, హరిత హోటల్ సమీపంలో, సబ్‌స్టేషన్ నుంచి పలుగుల బైపాస్ రోడ్డు వరకు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు స్థలం వద్ద సీసీ కెమెరాలు మరో 300 వరకు ఏర్పాటు చేస్తున్నారు.