
ఉపాధి పనులపై ఎండల ప్రభావం
ప్రభుత్వం ప్రకటించింది రూ.307
జిల్లాలో మాత్రం రూ.185 నుంచి రూ.240 వరకే..
పనే వేతనానికి ప్రామాణికం అంటున్న అధికారులు
కాటారం: ఉపాధి హామీ పథకంలో కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం రోజుకు రూ.307 ప్రకటించినప్పటికీ జిల్లాలో మాత్రం సగటు కూలి కేవలం రూ.224 మాత్రమే అందుతోంది. సిబ్బంది కూలీలకు నిర్దేశిత కొలతలు (మార్కింగ్) ఇస్తున్నప్పటికీ ఆ దిశగా పనులు చేయకపోవడంతోనే గిట్టుబాటు కూలి దక్కడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం, పనుల ప్రగతిపై పకడ్బందీగా ఆడిట్ నిర్వహిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు పక్కాగా కొలతలు నమోదు చేస్తున్నారు. దీంతో కూలీలకు గిట్టుబాటు కూలి అందకపోవడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు పనుల్లో త్వరగా అలసిపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన కూలి దక్కించుకోవడంలో విఫలమవుతున్నారని అధికారులు తెలుపుతున్నారు.
జిల్లాలో ఉపాధి హామీ వివరాలు..
ఉపాధి హామీ అమలయ్యే మండలాలు 11
గ్రామపంచాయతీలు 244
గ్రామాలు 391
జాబ్‌కార్డులు 1,09,843
కూలీల సంఖ్య 2,41,667