
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
రేగొండ: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. గురువారం మండలంలోని దమ్మన్నపేట, తిరుమలగిరి గ్రామాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి రెవెన్యూ చట్టంపై పైలట్ ప్రాజెక్ట్‌గా రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రైతుల నుంచి భూసమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజల దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, రైతులు ఇచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సదస్సులో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నోటీసులు జారీ చేసి, ప్రజలకు త్వరితగతిన న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్వేత, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ