
కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం
జ్ఞానదీపం ఏర్పాటు
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద నీటిమట్టం పెరిగింది. నాలుగు రోజులుగా మహారాష్ట్రలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ద్వారా గోదావరికి స్వల్ప వరద పెరిగింది. ప్రస్తుతం 2,350 క్యూసెక్కుల నీరు దిగువకు తరలిపోతోంది. నాలుగు రోజుల క్రితం వరకు ఎండల తీవ్రత నేపథ్యంలో 1,800 క్యూసెక్కులు తరలిపోయినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా, ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతినది పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం నీరు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
టెంట్‌సిటీ రెడీ..
పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం టెంట్‌సిటీ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 30వరకు టెంట్‌లు, ఏసీలతో సిద్ధం చేసి, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన సరస్వతిమాత విగ్రహం ఎదుట రెండు వైపులా జ్ఞానదీపం ఏర్పాటు చేశారు. రెండు చేతులు జోడించి తాళపత్ర గ్రంథాల్లో జ్యోతి వెలిగినట్లు కనిపించే సీఆర్‌సీతో తయారు చేసిన మెటల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేయించారు.

కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం

కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం