
మత్తుపానీయాలకు దూరంగా ఉండాలి
భూపాలపల్లి అర్బన్: యువత క్రీడా మైదానాలకు అలవాటు పడాలని, మత్తుపానీయాలకు దూరంగా ఉండాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రా జేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సురిమిళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. క్రీడలు యువకులకు మానసిక ఉల్లాసమే కాక శారీరక ధృడత్వాన్ని కలిగిస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నరేష్‌కుమార్, అధికార ప్రతినిధి మారుతి, సీనియర్ పీఓ శ్రావణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, హెచ్‌సీ యూ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, కోచ్‌లు రాజ్‌కుమార్, తిరుపతి, క్రీడాకారులు పాల్గొన్నారు.
జీఎం రాజేశ్వర్‌రెడ్డి
ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం