అకాల వర్షాలతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షాలతో జాగ్రత్త

May 15 2025 2:00 AM | Updated on May 15 2025 2:00 AM

అకాల వర్షాలతో జాగ్రత్త

అకాల వర్షాలతో జాగ్రత్త

మల్హర్‌: అకాల వర్షాలతో రైతులు జాగ్రత్తలు పాటించాలని డీసీఓ వాల్యనాయక్‌ అన్నారు. బుధవారం తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని కొండంపేట, కొయ్యూ రు, వల్లెంకుంట గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి సంబంధిత రైస్‌ మిల్లులకు పంపించాలని సెంటర్‌ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇప్ప మొండయ్య. అయిత రాజిరెడ్డి, పీఏసీఎస్‌ సీఈఓ సంతోష్‌, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement