కల్యాణలక్ష్మి నిరుపేదలకు వరం
చిట్యాల: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నిరుపేదలకు ఓ వరం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన 52మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ మేరకు నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, టేకుమట్ల మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ కృష్ణ, మండల నాయకులు మూల శంకర్‌గౌడ్, చిలుకల రాయకొంరు, కిష్టయ్య, కుమార్, లక్ష్మన్, అనిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణరావు


